ఇంతకీ బోయపాటి ఎవర్ని లాక్ చెస్తారో..

Published on May 25, 2021 11:02 pm IST

బోయపాటి శ్రీను.. ఒకప్పుడు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు తెగ ఉబలాట పడేవారు. బోయపాటి సైతం నిదానంగా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాను సెట్ చేసుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ బిజీ అయిపోతున్నారు. ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తివేస్తే ప్రతి హీరో కనీసం రెండు కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించేలా ఉన్నారు. అందుకే బోయపాటి తొందరపడుతున్నారు.

ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అందుకే బోయపాటి తర్వాతి సినిమా కోసం హీరోను వెతుక్కునే పనిలో ఉన్నారు. ఆయన జాబితాలో అల్లు అర్జున్, రవితేజ పేర్లు ముందు వరుసలో ఉన్నాయట. బన్నీతో ‘సరైనోడు’, రవితేజతో ‘భద్ర’ లాంటి హిట్ సినిమాలు తీశారు బోయపాటి. అందుకే ఈ ఇద్దరూ ఆయనతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వారి డేట్స్ అందుబాటులో లేవు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో ఫుల్ బిజీ. ఆ సినిమా తర్వాత ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. రవితేజ వెనుక కూడ నలుగురు దర్శకులున్నారు. ఇంత తైట్ షెడ్యూల్ నడుమ బోయపాటికి వీరి డేట్స్ దొరుకుతాయా అనేదే డౌట్.

సంబంధిత సమాచారం :