‘బ్రహ్మ ఆనందం’ ఓటీటీ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

‘బ్రహ్మ ఆనందం’ ఓటీటీ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Published on Mar 13, 2025 3:58 PM IST

హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం నటించిన రీసెంట్ మూవీ ‘బ్రహ్మ ఆనందం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ తెరకెక్కించగా రాజా గౌతమ్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతమేర విజయం సాధించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా దక్కించుకుంది. దీంతో బ్రహ్మ ఆనందం చిత్రాన్ని హోలీ పండుగ కానుకగా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది.

ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు