వివాదాస్పద ట్వీట్ చేసి నాలుక్కరుచుకున్న బ్రహ్మాజీ

Published on Oct 21, 2020 3:00 am IST


ఎంటెర్టైన్ చేద్దామని చేసే పనులు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుంటాయి. అలాంటి మిస్ ఫైర్ ఘటనే ప్రముఖ సహాయ నటుడు బ్రహ్మాజీ విషయంలో జరిగింది. తాజాగా హైదరాబాద్లో భారీ వర్షాలకు వరదలు సంభవించి అనేక ప్రాంతాలు జలమయ్యాయి. వందల ఇళ్లు నీట మునిగాయి. అలా మునిగిన ఇళ్లలో నటుడు బ్రహ్మాజీ ఇల్లు కూడ ఉంది. దీంతో బ్రహ్మాజీ మునిగిన తన ఇంటి ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ హైద‌రాబాద్ ఫ్ల‌డ్స్ కార‌ణంగా బోట్ కొనాల‌నుకుంటున్నాను. ద‌య‌చేసి బోట్స్ గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా స‌ల‌హా ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు.

ఆయన చేసిన ట్వీట్లో తప్పేమీ లేకపోయినా ట్వీట్ చేసిన సందర్భం, టైమింగ్ రాంగ్ కావడంతో మిస్ ఫైర్ అయి నెటిజన్లకు కోపం తెప్పించింది. వరదల కారణంగా జనం ఇంతలా అల్లాడుతుంటే, ప్రభుత్వం సహాయక చర్యల్లో కష్టాలు పడుతుంటే ఇలా సెటైర్స్ వేయడం కరెక్టేనా అంటూ మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో బ్రహ్మాజీ సైతం షాకయ్యారు. వెంటనే తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్స్ అన్నీ హైడ్ చేసేసి వివాదానికి ఫులుస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి నవ్వులు పూయిద్దామని బ్రహ్మాజీ చేసిన ప్రయత్నం విమర్శలకు గురయ్యేలా చేసింది.

సంబంధిత సమాచారం :

More