‘జోరు’లో హైలైట్ కానున్న సందీప్ కిషన్-బ్రహ్మానందంల కామెడీ

‘జోరు’లో హైలైట్ కానున్న సందీప్ కిషన్-బ్రహ్మానందంల కామెడీ

Published on Nov 3, 2014 8:21 AM IST

joru
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ‘జోరు’ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. ‘జోరు’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గుండెల్లో గోదారి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కుమార్ నాగేంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలు హీరోయిన్స్ గా నటించారు.

ఈ సినిమాలో మొదటి సారి సందీప్ కిషన్ కామెడీ కింగ్ బ్రహ్మానందంతో కలిసి నటించాడు. వీరిద్దరి కాంబినేషన్ ట్రాక్ చాలా బాగా వచ్చిందని, గ్యారంటీగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులు అంటున్నారు. అన్నట్టుగానే వీరిద్దరి ట్రాక్ వర్కౌట్ అయితే సినిమా మంచి హిట్ అయ్యే అవకాశం ఉంది. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు