బ్రేకింగ్..అల్లు అర్జున్ కి కూడా కోవిడ్ పాజిటివ్.!

Published on Apr 28, 2021 11:27 am IST

కరోనా వేవ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాము. ఈసారి రెండో వేవ్ కారణంగా మన టాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్ నటులు కరోనా బారిన పడ్డారు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ ఆ;;యూ అర్జున్ తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా అధికారికంగా తెలిపారు. తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అని అయితే ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో తాను ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని బన్నీ తెలిపాడు.

అలాగే తనని రీసెంట్ గా కలిసిన వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలని బన్నీ సూచించాడు. అంతే కాకుండా కుదిరినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని అలాగే తన వెల్ విషర్స్ మరియు అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని బన్నీ క్లారిటీ ఇచ్చాడు.అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉండి సేఫ్ గా ఉండాలని ఆకాంక్షించారు. మరి బన్నీ త్వరగా కోలుకోవాలని మనమంతా కూడా ఆశిద్దాం. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో “పుష్ప” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :