పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల లేటెస్ట్ మూవీ బ్రో నేడు భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సముద్రఖని తెరకెక్కించిన బ్రో మూవీ తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం రీమేక్ గా తెరకెక్కగా దీనిని జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మించాయి.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తన మార్క్ స్టైల్ యాక్టింగ్, స్వాగ్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ సహా నటీనటులు అందరి అలరించే నటన, సముద్రఖని సూపర్ టేకింగ్, థమన్ సాంగ్స్, మేకర్స్ భారీ నిర్మాణ విలువలు బ్రో ని సక్సెస్ చేశాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక నేడు బ్రో టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న అనంతరం ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు సముద్రఖని, సహా ఇతర బ్రో మూవీ సభ్యులు త్రివిక్రమ్ తో కలిసి దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
