‘బ్రోచేవారెవరురా’ ఫస్ట్ లుక్ విడుదలకానుంది !

‘బ్రోచేవారెవరురా’ ఫస్ట్ లుక్ విడుదలకానుంది !

Published on Dec 30, 2018 6:00 PM IST

Niveta Sree Nivedha

యువ హీరో శ్రీ విష్ణు , వివేక్ ఆత్రేయ కాంభినేషన్ లో ‘బ్రోచేవారెవరురా’ అనే చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రేపు ఉదయం 10 గంటలకు విడుదలకానుంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా రూపొందించారు. ఇక టైటిల్ , పోస్టర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన చిత్ర బృందం రేపు ఎలాంటి సప్రైజ్ ఇస్తారో చూడాలి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నివేత థామస్ , నివేత పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు.

వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Niveta Sree Nivedhsa

తాజా వార్తలు