“బ్రోచేవారెవరురా” విడుదల తేదీ ఖరారు.

Published on Jun 11, 2019 11:48 am IST

హీరో శ్రీ విష్ణు, స్టార్ కమెడియన్స్ ప్రియదర్శి,రాహుల్ ప్రధాన పాత్రలలో రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “బ్రోచేవారెవరురా”. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓ కొత్తతరహా కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీని నేడు ప్రకటించారు. ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

నీది నాది ఒకటే కథ, మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలతో మంచి పేరుతెచ్చుకున్న శ్రీవిష్ణు ఈ మూవీ విజయం పై చాలా ఆశలే పెట్టుకున్నారట. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More