నాని సినిమాలో బ్రదర్స్ సెంటిమెంట్ హైలెట్

Published on Jan 28, 2020 6:15 pm IST

వరుసగా ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాలతో మెప్పించిన నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నాడు. గత రెండు సినిమాల్లో ప్రేమికులు, భార్యాభర్తల మధ్య కథ నడిపిన శివ నిర్వాణ ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య కథను నడిపిస్తారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో సోదరుల నడుమ ఉండే ఎమోషన్స్ గట్టిగా హైలెట్ అవుతాయని, నాని సోదరుడిగా సీనియర్ నటుడు నటించనున్నారని అంటున్నారు.
ఈ సినిమాను శివ నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. శివ గత చిత్రాలు ‘నిన్నుకోరి, మజిలీ’ రెండూ మంచి విజయాల్ని సాధించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సంబంధిత సమాచారం :

X
More