
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఉన్న కంటెంట్ తో చేసిన సినిమా ‘బ్రూస్ లీ’. ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ రోజు రాత్రి కల్లా రీ రికార్డింగ్ పనులతో పాటు డిటిఎస్ పనులు కూడా పూర్తికానున్నాయి. అవి పూర్తయితే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. అలాగే ఈ చిత్ర టీం రేపు ఈ సినిమాని సెన్సార్ కి పంపాలని సెన్సార్ స్లాట్ ని కూడా బుక్ చేసేసారు.
రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో మరింత జోరు చూపనుంది. ఇప్పటికే రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న ఈ సినిమాకి యాక్షన్, కామెడీని కూడా పర్ఫెక్ట్ గా శ్రీను వైట్ల మిక్స్ చేసాడట. ఇటీవలే రిలీజ్ అయిన ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నతీంచిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

