రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ కి ఆడియో వేదిక ఫిక్స్.!

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ కి ఆడియో వేదిక ఫిక్స్.!

Published on Sep 30, 2015 12:28 PM IST

Bruce-Lee1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకో 16 రోజులు ఉండగా, ఇమరొ 6 రోజుల షూటింగ్ బాలన్స్ ఉంది. అనుకున్నదాని ప్రకారమే షూటింగ్ ని ఫినిష్ చేస్తూ సినిమాని ఆన్ టైం రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ‘బ్రూస్ లీ – ది ఫైటర్’ ఆడియోని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి న్నీ సిద్దం చేసారు. ఇన్ని రోజులు వేదిక విషయంలో నిర్ణయం తీసుకోని ఈ చిత్ర టీం తాజాగా బ్రూస్ లీ ఆడియోని అక్రోబార్ 2న హైటెక్స్ గ్రౌండ్స్ లో చేయడానికి నిర్ణయించింది.

దాంతో ఆడియో లాంచ్ పాస్ లలో వేదిక పేరుని కలిపి ప్రింట్ చేసి అందరి అభిమానులకు సెలబ్రిటీలకు పంచనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిపై వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. నేటితో చిరు పార్ట్ కి సంబందించిన సీన్స్ షూటింగ్ ముగుస్తుంది. రేపటి నుంచి చరణ్ పై బాలన్స్ ఉన్న సీన్స్ ని షూట్ చేస్తారు. శ్రీను వైట్ల ఈ సారి అభిమానులను మెప్పించేలా ఈ సినిమాని సిద్దం చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నదియా, రావు రమేష్, కృతి కర్భంద, అరుణ్ విజయ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు