ఫ్యాన్సీ ధర పలికిన మహేష్ మూవీ కర్ణాటక థియరిటికల్ రైట్స్

Published on Dec 13, 2019 8:12 am IST

మహేష్, రష్మిక జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేష స్పందన దక్కించుకుంది. అనిల్ రావిపూడి మార్కు కామెడీ, సాంగ్స్, ఫైట్స్ అండ్ ఎమోషన్స్ కలిగిన పూర్తి స్థాయి చిత్రంగా సరిలేరు నీకెవ్వరు మూవీ ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం నుండి ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు రెండు సాంగ్స్ విడుదల కాగా వచ్చే సోమవారం మూడవ సాంగ్ విడుదల కానుంది.

కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఉన్న అంచనాల రీత్యా ఈ మూవీ థియరిటికల్ హక్కుల కొరకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ చిత్ర కర్ణాటక విడుదల హక్కులను బృందా అసోసియేట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బృందా అసోసియేట్స్ తెలియజేశారు. ఈ మూవీ హక్కుల కొరకు బృందా అసోసియేట్స్ ఫ్యాన్సీ ధర చెల్లించినట్లు తెలుస్తుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తుండగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More