‘పెద్ది’ లో బొమన్ ఇరానీ రోల్ విమర్శలపై బుచ్చిబాబు సాలిడ్ రిప్లై వైరల్

‘పెద్ది’ లో బొమన్ ఇరానీ రోల్ విమర్శలపై బుచ్చిబాబు సాలిడ్ రిప్లై వైరల్

Published on Jun 14, 2026 9:26 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి భారీ వసూళ్లు సాధించింది. అయితే రిలీజ్ రోజునే కొన్ని అంశాలలో విమర్శలు కూడా వచ్చాయి కానీ వాటిని అధిగమించి పెద్ది సూపర్ పెర్ఫామెన్స్ ని చేస్తుంది.

అలా వచ్చిన కొన్ని విమర్శల్లో నటుడు బొమన్ ఇరానీ రోల్ పై కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఒలింపిక్స్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తికి పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యిన పెద్ది ఎవరో తెలియకపోవడం లాజిక్ లేదని విమర్శలు వచ్చాయి. కానీ దీనిపై బుచ్చిబాబు ఇచ్చిన సాలిడ్ రిప్లై వైరల్ గా మారింది. ఈ విషయంపై నేను కూడా చాలా రీసెర్చ్ చేసానని.

ఆ బోర్డు సభ్యులు ఐదేళ్లు సర్వీస్ లో ఉండే సమయంలో ఎప్పుడో గెలుపొందిన క్రీడాకారులు పేర్లు గుర్తుంచుకుంటారు అనేది నిజం కాదని అంతెందుకు మన జాతీయ క్రీడ హాకీ జట్టు కెప్టెన్ ఎవరు వారి పేరు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నామని బొమన్ ఇరానీ రోల్ కి సంబంధించి వచ్చిన లాజికల్ విమర్శకి బుచ్చిబాబు ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు