
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన కామెడీ – యాక్షన్ ఎంటర్టైనర్ ‘శివమ్’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దీంతో ఈ వారంలోనే ఫస్ట్ కాపీని సిద్దం చేసి సెన్సార్ కి కూడా పంపనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. అంతే కాకుండా పలు ఏరియాల్లో బంపర్ ప్రైజ్ కి ఈ సినిమా రైట్స్ అమ్ముడు పోయాయి.
మాకు అందిన ట్రేడ్ రిపోర్ట్స్ సమాచారం ప్రకారం శివమ్ వైజాగ్ రైట్స్ బంపర్ ప్రైజ్ పలికాయి. వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సుమారు 2.25 కోట్లకి అమ్ముడు పోయాయి. రామ్ గత సినిమా పండగ చేస్కో మంచి హిట్ అవ్వడంతో పాటు శివమ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ రేట్లకి రైట్స్ అమ్ముడు పోతున్నాయి. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

