వాళ్లిద్దరి మధ్య ఓ రిథమ్ అలా సెట్టైందట..!

Published on Jan 11, 2020 9:38 am IST

17 ఏళ్ల కెరీర్ లో బన్నీ చేసింది 19 సినిమాలు వీటిలో మూడు సినిమాలు దర్శకుడు త్రివిక్రమ్ తో చేశారు. అలాగే త్రివిక్రమ్ ఇప్పటివరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో మూడు సినిమాలు బన్నీవే. ఇదే విషయమై బన్నీని అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కొందరు దర్శకులు హీరోలకు మధ్య ఒక రిథమ్ సెట్ అవుతుంది. వారి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే గతంలో చిరంజీవి గారు, దర్శకులు కోందండరామిరెడ్డి రెడ్డిగారు వరుసగా చాలా సినిమాలు చేశారు. వారిది హిట్ కాంబినేషన్. వారిద్దరి మధ్య మంచి రిథమ్ ఉండేది. అలాగే త్రివిక్రమ్ నాకు మధ్య మంచి రిథమ్ ఏర్పడింది. అందుకే మా ఇద్దరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వచ్చాయి అన్నారు.

ఇక అల వైకుంఠపురంలో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా..టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక రోల్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :