వంద మందికి పైగా ఫైటర్స్ తో అల్లు అర్జున్ ఫైట్.!

వంద మందికి పైగా ఫైటర్స్ తో అల్లు అర్జున్ ఫైట్.!

Published on Feb 9, 2015 10:27 AM IST

allu-arjun2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్న సినిమా ‘సన్ అఫ్ సత్యమూర్తి'(వర్కింగ్ టైటిల్). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. ఈ వారంలో ఈ చిత్ర టీం రెండు పాటల షూట్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్నీ మీకు తెలియజేస్తున్నాం. ప్రతి సినిమాలోనూ ఫైట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా ఫైట్స్ చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ 100కి మందికి పైగా ఫైటర్స్ తో ఫైట్ చేస్తాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని ఇటీవలే షూట్ చేసారు. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, సినిమాకి ప్రధాన హైలైట్స్ లో ఇది కూడా నిలుస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు