బన్నీ, మహేష్ లను ఇబ్బందుల్లో పడేసిన రజనీ !
Published on Dec 3, 2017 12:40 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ ను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కానీ పక్క తేదీ మాత్రం చెప్పలేదు. క్నీ సినీ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 27న విడుదల ఉండొచ్చని తెలుస్తోంది. ఇలా రజనీ సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుండటం తెలుగు స్టార్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ ల ఇబ్బందిగా మారింది.

ఎందుకంటే ఏప్రిల్ 27న మహేష్ ‘భరత్ అనే నేను’, బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ ఇద్దరు హీరోలు ఈ తేదీని చాలా నెలల క్రితమే లాక్ చేయి పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే రోజున రజనీ సినిమా అంటే ఈ రెండు చిత్రాలకు అన్ని విధాలా భారీ నష్టం వాటిల్లే అవకాశాముంది. అందుకే ఈ చిత్ర నిర్మాతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు.

నిర్మాత బన్నీ వాస్ అయితే ఇలా ‘2.0’ ఏప్రిల్ 27న వస్తుండటం స్థానిక తెలుగు సినిమాలకు పెద్ద నష్టంగా పరిణమిస్తుందని, ఈ సమస్యను ఏపీ, తెలంగాణ నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళతామని, తాము ముందుగా అనుకున్న తేదీకే కట్టుబడతామని అన్నారు. మరి చివరికి ఏప్రిల్ 27వ తేదీని ఏయే సినిమాలు దక్కిచుకుంటాయో చూడాలి.

 
Like us on Facebook