ఆసంస్థకు బన్నీ బంగారు గనిలా దొరికాడు.

Published on Aug 7, 2019 8:32 am IST

అల్లు అర్జున్ సినిమాలు యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. ఏకంగా వందల మిల్లియన్స్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు ని నెలకొల్పోయాయి. విషయంలోకి వెళితే. అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు,అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది. అలాగే హరీష్ శంకర్ తెరకెక్కించిన “దువ్వాడ జగన్నాధం” మూవీ కూడా తెలుగులో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.

ఈ రెండు చిత్రాల హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. “సరైనోడు” ఏకంగా 200 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డుని నమోదు చేసింది. అలాగే “దువ్వాడ జగన్నాధం” కూడా 150 మిల్లియన్స్ సాధించింది. ఈ మూవీల హిందీ డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్న గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థకు ఈ రెండు బంగారు గనిలా దొరికాయి. అత్యంత ఆదరణతో రికార్డు వ్యూస్ పొందడంతో ఈ సంస్థకు మంచి లాభాలు వచ్చిపడుతున్నాయని వినికిడి.

కాగా ఈ సంధర్బంగా హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. ప్రాంతాలకు అతీతంగా నా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు, భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలు చేసి మిమ్ముల్ని సంతోషపరుస్తాను అంటూ, ఈ రెండు చిత్రాలకు పని చేసిన నటులకు, సాంకేతిక నిపుణులకు కృతఙ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :