బాలీవుడ్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

బాలీవుడ్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

Published on Oct 11, 2015 7:00 PM IST

Allu-arjun
స్టార్ ఇమేజ్ తో సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఓ మంచి సినిమాలో తను కూడా భాగం కావాలి, తనకి చేతనైన సాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో స్టైలిష్ స్టార్ స్వతహాగా ముందుకు వచ్చి చేసిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాకి కీలకమైన గోనగన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనని కనబరిచాడు. గుణశేఖర్ ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న తరుణంలో అల్లు అర్జున్ ఇలా చేయూతని ఇస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టాక్స్ ఎత్తేసి మరింత సాయాన్ని అందించాడు.

రుద్రమదేవి ఈ రోజు సాధిస్తున్న కలెక్షన్స్ విషయంలో మేజర్ పార్ట్ అల్లు అర్జున్ కే చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇక్కడి నుంచి ఓ హీరో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం అయిన పని. దాని కోసం తను ఇక్కడ 10 సంవత్సరాల కెరీర్ ని పణంగా పెట్టాలి. అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా కాకుండా ఏదైనా మంచి ఆఫర్స్ వస్తే చెయ్యాలి. లేదా ఒక మంచి సినిమాలో అక్కడి హీరో ఇక్కడి హీరో కలిసి చేస్తే బాగుంటుంది, మార్కెట్ కూడా పెరుగుతుందని’ బన్ని అన్నాడు. ఇలాంటి పరిణామం గనుక చోటు చేసుకుంటే తెలుగు సినిమా స్థాయి భారీగా పెరుగుతుంది.

తాజా వార్తలు