వేసవికి రానున్న బన్నీ-విక్రమ్ కుమార్ ల చిత్రం ?

Published on Jul 10, 2018 7:16 pm IST

కథా రచయిత వక్కంతం వంశీ కి దర్శకునిగా అవకాశమిస్తు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం ఇటీవల విడుదలై అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత బన్నీ రెండు నెలలు విరామం తీసుకొని ఇప్పుడు ఎట్టకేలకు ‘మనం , 24’ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంలో బన్నీద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడట.

సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రం ఆగష్టు రెండవ వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం :