జూన్ రేసులో ‘బుర్రకథ’ కూడా !

Published on Jun 8, 2019 3:00 am IST

యంగ్ హీరో ఆది సాయికుమార్ చేస్తున్న చిత్రం ‘బుర్రకథ’. రచయిత నుండి దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క టీజర్ ఓటీవలె విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. దీంతో చిత్ర నిర్మాతలు విడుదలకు సిద్ధమయ్యారు.

జూన్ 28వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే జూన్ నెలలో దగ్గరదగ్గర 7 నుండి 8 సినిమాలు రిలీజవుతుండగా వాటి జాబితాలోకి ‘బుర్రకథ’ కూడా చేరింది. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇందులో హీరో పాత్ర రెండు విధాలుగా పనిచేసే మెదడు అంటే మల్టిపుల్ పర్సనాలిటీ కండిషన్ అనే ప్రాబ్లమ్ ఉంటుందట. దీపాల ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మిస్తి చక్రబర్తి, నైరా షా కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More