బన్నీ “బుట్టబొమ్మ” మరో సెన్సేషనల్ మైల్ స్టోన్.!

Published on May 23, 2021 12:06 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది భారీ హిట్ గా నిలిచింది. మరి అలాగే ఒక్క సినిమా పరంగానే కాకుండా ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఈ చిత్రం మరోస్థాయి విజయాన్ని అందుకోవడంలో ఎంతగానో దోహదపడింది.

అలా ఈ చిత్రంలో కంపోజ్ చేసిన మాటల్లో అతి పెద్ద హిట్ బుట్టబొమ్మ విజువల్ సంచలన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలా మన దక్షిణాదిలోనే పలు ఫాస్టెస్ట్ భారీ రికార్డులు కొల్లగొట్టిన ఈ సాంగ్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయ్యింది. ఏకంగా మన దేశంలోనే ఫాస్టెస్ట్ 4 మిలియన్ లైక్డ్ వీడియోగా ఈ సాంగ్ నయా రికార్డు సెట్ చేసి పెట్టింది. దీనితో బన్నీ ఖాతాలో మరో సాలిడ్ రికార్డు పడ్డట్టు అయ్యింది. మరి ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :