అల వైకుంఠపురంలో రికార్డుల మోత ఆగడంలేదుగా..!

Published on Apr 4, 2020 11:20 am IST

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్-త్రివిక్రమ్ లు మ్యాజిక్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానం ఆక్రమించింది. త్రివిక్రమ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావడంతో అది వెండితెరపై ఆటం బాంబ్ లా పేలింది. కాగా ఈ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి థమన్ సాంగ్స్. ఈ చిత్రం కోసం ఆయన స్వరపరిచిన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి.

ఈ సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకున్నాయి. కాగా ఇటీవల అల వైకుంఠపురంలోని బుట్ట బొమ్మా.ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాట ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. అంటే ఏకంగా పది కోట్ల మంది ఈ పాటను చూశారన్న మాట. అలాగే ఈ వీడియో సాంగ్స్ లైక్స్ కూడా వన్ మిలియన్ కి చేరుకోవడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.

వీడియో సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More