అల వైకుంఠపురములో.. కొత్త అప్ డేట్ !

Published on Dec 15, 2019 4:33 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి మరో సాంగ్ టీజర్ రాబోతుంది. బ్యూటీఫుల్ మెలోడీ ‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ ను డిసెంబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది.

కాగా ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ మొత్తానికి సినిమా పై ఉన్న భారీ అంచనాలు ఇంకా పెంచాయి. పైగా ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More