ఆ సినిమాలో నాని గెస్ట్ రోల్ చేస్తున్నాడా ?

jyo-nani
ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో హీరోలు వేరే హీరోల సినిమాల్లో అతిధి పాత్రలు వేయడం సాధారణ విషయమైపోయింది. హీరోలు, దర్శకుల మధ్య ఉన్న బంధమే ఇందుకు కారణమనిచెప్పొచ్చు. ప్రస్తుతం ఇలా గెస్ట్ రోల్ చేసే హీరోల లిస్టులో నాని కూడా చేరిపోయాడట. ఈ నేచ్యురల్ స్టార్ తన స్నేహితుడు, దర్శకుడు శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘జ్యో అచ్యుతానంద’ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడని వినికిడి.

సినిమాలోని ఓ కీలక సందర్భంలో నాని కనిపిస్తాడని, ఆ సీన్ ప్రేక్షకులకు మంచి ధ్రిల్ ను ఇస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ విషయం ముందుగానే రివీల్ చేస్తే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవడం కష్టమని యూనిట్ ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతోందట. అసలు సినిమాలో నాని సినిమాలో ఉన్నాడో లేదో ? ఉంటే ఎలా కనిపిస్తాడు ? అన్నది సినిమా విడుదలయ్యాక కానీ నిర్ధారణ కాదు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా చేస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమా బాగా క్లిక్కై సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.