బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?

బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?

Published on Mar 27, 2024 12:02 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క హిందీ డిజిటల్ రైట్స్ రూ. 175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. కాగా ఈ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇక ఇప్పటికే కల్కి సౌత్ భాషల డిజిటల్ రైట్స్ రూ. 150 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మే 9న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు