డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైన జోష్‌లో ఉన్న విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరో అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47). ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడు వీరి కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశగా చూస్తున్నారు. అయితే, ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ చిత్ర రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


