గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK112’ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్ 25న అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ‘ఆచార్య’, ‘దేవర’ చిత్రాల తర్వాత కొరటాల శివ సరికొత్త కథతో బాలయ్యను డైరెక్ట్ చేయబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వేదిక కానుందట. దైవసన్నిధిలో, అదీ ఏపీ రాజధాని నడిబొడ్డున ఈ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకకు నందమూరి, నారా కుటుంబాల నుంచి ముఖ్య నేతలు హాజరుకానున్నారట.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారట. బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు.


