డైరెక్టర్ వేణు యెల్దండి, దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ'(Yellamma). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ టీజర్‌తోనే భారీ అంచనాలను పెంచేసింది. గతంలో నాని, నితిన్ వంటి హీరోల దగ్గరకు వెళ్లిన ఈ కథ, చివరకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు రావడం మరియు వేణు ‘బలగం’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈ సినిమా కథా నేపథ్యం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కోట్లాది మంది ఆరాధించే రేణుక ఎల్లమ్మ చుట్టూ తిరుగుతుందని సమాచారం. వేణు సుమారు మూడేళ్ల పాటు శ్రమించి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. గ్రామీణ దేవత నేపథ్యానికి, జానపద కళాకారుల జీవితాలను జోడించి ఈ కథను అత్యంత సహజంగా, ఎమోషనల్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో దేవిశ్రీ ప్రసాద్ క్యారెక్టరైజేషన్ చాలా షాకింగ్‌గా, మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్. 2026లో రాబోతున్న సినిమాల్లో ‘ఎల్లమ్మ’ అత్యంత ప్రభావవంతమైన కంటెంట్‌తో రానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. జానపద కళలను, భక్తిని మరియు సామాజిక అంశాలను మేళవించి వేణు ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.


