టాక్సిక్ రెమ్యూనరేషన్లకే 100 కోట్ల ఖర్చు..?

టాక్సిక్ రెమ్యూనరేషన్లకే 100 కోట్ల ఖర్చు..?

Published on Jul 8, 2026 8:57 PM IST

Toxic

​’కేజీఎఫ్’ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో యశ్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే రూ. 50 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్‌తో పాటు, సినిమా లాభాల్లో భారీ శాతాన్ని వాటాగా అందుకోనున్నాడు.

​ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ల పారితోషికాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. కియారా అద్వానీ తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 15 కోట్లు తీసుకోగా, నయనతారకు రూ. 12 కోట్లు చెల్లించారు. అలాగే తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లకు చెరో రూ. 3 కోట్లు, హుమా ఖురేషికి రూ. 2 కోట్లు ముట్టాయి. దర్శకురాలు, సాంకేతిక నిపుణుల ఖర్చులతో కలిపి కేవలం రెమ్యునరేషన్ల కోసమే రూ. 100 కోట్లు ఖర్చయింది.

భారీ అంచనాలు ఉన్న ‘టాక్సిక్’ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు