బాలయ్యను ‘ఆచార్య’కు లింక్ చేస్తున్న కొరటాల..?

బాలయ్యను ‘ఆచార్య’కు లింక్ చేస్తున్న కొరటాల..?

Published on May 9, 2026 5:02 PM IST

Koratala Siva

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 సినిమాలో నటిస్తున్న బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమా ఇప్పటికే అనౌన్స్ చేయగా, మే 21న అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక టైటిల్‌ను ఫిక్స్ చసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి కారణం ఈ సినిమాలో బాలయ్య కార్పెంటర్ గా కనిపిస్తాడని.. అంతేగాక ఈ టైటిల్‌కు యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

గతంలో మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రంలోనూ చిరంజీవి కార్పెంటర్‌గా కనిపించాడు. అయితే, ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. కానీ, ఈసారి బాలయ్య కోసం పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట కొరటాల. మరి ఈ బాలయ్య-ఆచార్య లింక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు