‘వారణాసి’ నుంచి మహేష్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అప్పుడేనా..?

Varanasi

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ గెటప్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో, మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

​అయితే, ఈ లుక్‌ను ఇప్పుడే రివీల్ చేయాలా లేక థియేటర్లో సర్ప్రైజ్‌గా ఉంచాలా అనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లీకేజీల భయం ఉండటంతో ముందే విడుదల చేయడం మేలని కొందరు భావిస్తున్నారు. జక్కన్న నిర్ణయంపైనే ఈ సస్పెన్స్ ఆధారపడి ఉంది.

​మరోవైపు, మహేష్ రాముడి లుక్ అద్భుతంగా ఉండబోతోందని టాక్. ఇటీవల రణబీర్ కపూర్ ‘రామాయణ’ లుక్‌పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో, రాజమౌళి రూపొందించిన మహేష్ లుక్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ అద్భుత దృశ్యం మే 31న కనిపిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version