మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ (Peddi) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం ఆ తేదీన రావడం కష్టంగా కనిపిస్తుంది. చిత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుండటం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ఇక తెలంగాణలో టికెట్ రేట్ల విషయం కూడా ఈ చిత్ర ఆలస్యానికి కారణంగా మారనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫెస్టివల్ టైమ్‌కు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట.
అయితే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని 2026 దసరా పండుగకు రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నా, దసరా సీజన్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి నిజంగానే ‘పెద్ది’ (Peddi) చిత్రం దసరా పండుగ వరకు రిలీజ్ కాదా..? అనే విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


