అక్కడ సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న మృణాల్..?

అక్కడ సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న మృణాల్..?

Published on Jan 28, 2026 12:00 AM IST

Mrunal Thakur

అందాల భామ మృణాల్ ఠాకూర్ ఎట్టకేలకు తన తమిళ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. సరైన కథ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ, కోలీవుడ్ స్టార్ హీరో శింబు సరసన నటించే భారీ అవకాశాన్ని దక్కించుకుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం #STR51 అనే వర్కింగ్ టైటిల్‌తో పట్టాలెక్కనుంది.

గతేడాది ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథ విన్న వెంటనే మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా మృణాల్ ఎంట్రీపై ప్రకటన చేయనుంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న మృణాల్, సింబుతో జతకట్టడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు