టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్టర్ మైండ్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా అనౌన్స్ కాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సినిమా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఈ సినిమా థీమ్ మ్యూజిక్‌కు వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే #AA23 ఒక సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. కేవలం మూవీ అనౌన్స్‌మెంట్ థీమ్‌తోనే 3.55 లక్షలకు(355K) పైగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తయారయ్యాయి. ఒక సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌కు ఈ స్థాయిలో రీల్స్ రావడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి.
ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో సినిమా ప్రారంభం నుండే హైప్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. ఆ విషయంలో #AA23 వంద శాతం సక్సెస్ అయింది. ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ కలల ప్రాజెక్ట్ అయిన ‘ఇరుంబుకై మాయావి’ అని ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, పుష్ప-2 తర్వాత బన్నీ నుండి రాబోతున్న మరో పాన్ ఇండియా విజువల్ వండర్ కానుంది.


