పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. నిజమైతే నెక్స్ట్ లెవెల్ అదృష్టమే..!

పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. నిజమైతే నెక్స్ట్ లెవెల్ అదృష్టమే..!

Published on Jun 30, 2026 2:00 AM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక, టాలీవుడ్‌లో వెనుకబడిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సుందరి ఒక భారీ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓజి 2’ని ఇటీవల అనౌన్స్ చేశారు. ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి గతంలోనే పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే కాంబినేషన్ సెట్ అవ్వాల్సింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మొదట పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, అప్పట్లో డేట్స్ సర్దుబాటు కాకపోవడం మరియు ఇతర కారణాల వల్ల ఆ కాంబినేషన్ పట్టాలెక్కలేదు.

ఒకవేళ ఇప్పుడు ‘ఓజీ 2’ చిత్రానికి సంబంధించిన వార్తలు నిజమైతే మాత్రం, మెగా అభిమానులతో పాటు పూజా కెరీర్‌కు కూడా ఇది ఒక బిగ్ బూస్ట్ అని చెప్పవచ్చు. వరుస పరాజయాలతో కొంతకాలంగా సైలెంట్ అయిన పూజా హెగ్డేకు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ లా మారబోతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ భామకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కిందా లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు