పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా ‘ది రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ ప్రొడక్షన్ హౌజ్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది.
గతంలోనూ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. ఆ సినిమా కూడా నష్టాలను మిగిల్చింది. వాటిని ‘రాజాసాబ్’తో రికవర్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా కూడా నష్టాలను మిగిల్చింది. ఇక ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ రైట్స్ కూడా ఈ బ్యానర్ దగ్గరే ఉన్నాయి. ఆ సినిమాతో నష్టాలను కవర్ చేయాలని మరోసారి ప్రయత్నించబోతున్నారు.
అయితే, ఈ బ్యానర్‌కు ప్రభాస్ తప్పకుండా ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. 2028లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. సదరు బ్యానర్‌కు భారీ నష్టాలు రావడంతో ప్రభాస్ ఈ మేరకు వారికి మాట ఇచ్చాడట.


