శర్వా సినిమాలో ప్రీతి ముకుందన్.. జోడీ అదిరిపోవాల్సిందే..!

శర్వా సినిమాలో ప్రీతి ముకుందన్.. జోడీ అదిరిపోవాల్సిందే..!

Published on Jun 17, 2026 10:09 AM IST

Sharwanand

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆగస్టు 28న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘భోగి’ షూటింగ్ పూర్తి కాగానే, శర్వానంద్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోగా, ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ సరసన నటించేందుకు యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రీతి అడుగుపెట్టింది. రీసెంట్‌గా ‘బ్లాస్ట్’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు శర్వా సరసన నటిస్తుందనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. శర్వానంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు