రాఘవ లారెన్స్ ప్రస్తుతం తన సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న ‘కాంచన 4’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండియన్ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన ఈ హారర్ కామెడీ సిరీస్ తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాకు ఎంతో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆమె కనిపించనుందని, ఆ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్‌పై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ చిత్రంతోనే నోరా ఫతేహి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ అధినేత మనీష్ షా, సన్ పిక్చర్స్ కళానిధి మారన్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


