మాస్ మహారాజా రవితేజ మరియు కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు కాంబినేషన్‌లో ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు సినీ సర్కిల్స్‌లో గతకొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయనున్నాడని.. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాకు ‘వీరాధి వీరులంట’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.
పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రాబోయే సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాపై అధికారిక ప్రకటన.. టైటిల్ పై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాలి.


