టాక్సిక్ రిలీజ్‌పై మరో కొత్త రూమర్.. ఏకంగా అప్పుడేనట..!

టాక్సిక్ రిలీజ్‌పై మరో కొత్త రూమర్.. ఏకంగా అప్పుడేనట..!

Published on Jun 15, 2026 5:04 PM IST

Toxic

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుండటంతో అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, వచ్చే సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఇప్పటికే 2027 సంక్రాంతి విడుదలే టార్గెట్‌గా రెండు మూడు భారీ బడ్జెట్ సినిమాలు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి అప్పుడే థియేటర్లను బుక్ చేసుకునే పనిలో పడ్డారు. ఇలాంటి తరుణంలో పాన్-ఇండియా క్రేజ్ ఉన్న యష్ ‘టాక్సిక్’ సినిమాతో కూడా ఈ రేసులోకి వస్తే బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు.

సంక్రాంతి పండగ సీజన్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద బిజినెస్ విండో. ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. కానీ, ‘టాక్సిక్’ లాంటి భారీ ప్రాజెక్ట్ తోడైతే మాత్రం థియేటర్ల కేటాయింపు, వసూళ్ల పరంగా గట్టి పోటీ ఎదురవుతుంది. మరి ఈ సంక్రాంతి వార్‌లో ఏయే సినిమాలు నిలుస్తాయి, ఎవరు విజేతగా నిలుస్తారనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు