రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి ఇలాంటి రన్‌టైమ్ లాక్ చేశారా..?

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి ఇలాంటి రన్‌టైమ్ లాక్ చేశారా..?

Published on Jan 1, 2026 2:00 AM IST

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇక ఈ సినిమాతో రవితేజ చాలా రోజుల తర్వాత తన జోనర్ మార్చుకున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా రన్‌టైమ్ లాక్ అయిందనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ లాక్ చేశారని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. ఇది ఈ చిత్రానికి చాలా క్రిస్పీ రన్‌టైమ్ అని చెప్పాలి. రవితేజ సినిమాలకు ఇలాంటి రన్‌టైమ్ చాలా అరుదు.

మరి నిజంగానే ఈ చిత్రానికి ఇలాంటి రన్‌టైమ్ లాక్ చేశారా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు