మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి తనదైన స్టయిల్‌లో రూపొందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది. 2025 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబట్టింది.
దీంతో ఇప్పుడు చిరు కూడా రూ.300 కోట్ల గ్రాస్ ఫీట్ సాధిస్తారా.. అనే చర్చ సినీ సర్కి్ల్స్‌లో జరుగుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.


