
బాలకృష్ణ-కళ్యాణ్ రామ్, వెంకటేష్-రవితేజ ఇలా క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులని చెప్పుకున్న సినిమాలన్నీ మళ్ళీ అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లు ఓకే అయిన మరుక్షణమే నిర్మాతల మదిలో మెదిలిన సినిమా ‘జిల్లా’. మోహన్ లాల్, విజయ్ హీరోలుగా తమిళంలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది జిల్లా. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనకు చాలా మంది నిర్మాతలు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే పైన చెప్పుకున్న కాంబినేషన్లు తెరపైకి వచ్చాయి.
తాజాగా జిల్లాను తెలుగులో ఆర్.బీ,చౌదరి, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ విడుదల చేసేందుకు హక్కులు పొందాయి. నేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన కాజల్ నటించింది. త్వరలోనే ఈ సినిమా తెలుగులో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగులో హీరో విజయ్‌కి ఈ మధ్య కాలంలో పెరిగిన మార్కెట్ కొంత అనుకూలించే అంశం. ఇక ఈ సినిమా తెలుగులో విడుదలవ్వడం ఖాయంగా కనిపిస్తుండడంతో మరో కొత్త కథ సిద్ధమయ్యే వరకూ పై కాంబినేషన్లు అటకెక్కినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

