“రాధే శ్యామ్” గాసిప్స్ నిజం అనుకోవచ్చా.?

Published on Oct 24, 2020 7:01 am IST

మొదటిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రస్తుతం తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” అనే స్వచ్ఛమైన ప్రేమకావ్యంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికర లైన్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ మరింత హైప్ ను సంతరించుకుంది.

ఇటీవలే విడుదల చేసిన ప్రభాస్ మరియు పూజా హెగ్డేల పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు చిరు అనుమానాలు కూడా అభిమానులు మరియు సినీ విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అదేంటో చూద్దాం. మొదట టైటిల్ లో పరిశీలిస్తే రాధా శ్యామ్ అనే ఇద్దరి పాత్రలకు సరిపడా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ రివీల్ చేసింది మాత్రం వేరే పేర్లు.

అయితే అప్పుడు వినిపించిన గాసిప్స్ ప్రకారం ఈ చిత్రంలో డ్యూయల్ రోల్స్ కూడా కనిపిస్తాయని టాక్ వినిపించింది. ఇప్పుడు రివీల్ చేసిన రోల్స్ చూస్తుంటే నిజంగానే సినిమాలో ఇద్దరివీ డ్యూయల్ రోల్స్ ఉంటాయా లేక కేవలం ఒకరిదేనా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి రాధా కృష్ణ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More