క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ ఘాటైన సెటైర్…!

Published on Aug 27, 2019 11:51 am IST

వర్మ తాజా చిత్రం “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ థీరీ కొందరికి కారం పూసినంత ఘాటుగా తగిలింది. మరికొందరికి నిజమే కదా అని ఆలోచన కలిగేలా ఉంది. ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ లో వర్మ వాయిస్ ఓవర్ తోపాటు, ఆయన పాడటం జరిగింది.

దేశంలో మనుషులు కుల సంకుచిత భావాలతో నిండిపోయినప్పుడు కులం గురించి చెప్పుకోవడంలో తప్పేముంది. పైకి వేదాలు వల్లిస్తూ…,లోపల మనఃసాక్షిని కుల ప్రాదిపదికన నడిపిస్తే ప్రయోజనమేముంది. కులానికి మేము వ్యతిరేకులమనే ఈ వేషాలెందుకు, చేసేవన్నీ కులం ఆధారంగా చేస్తున్నప్పుడు. విద్యా,ఉద్యోగం,రాజకీయం పనేదైనా, ప్రయోజనం ఎలాంటిదైనా అసలు ప్రామాణికం కులమే అయినప్పుడు బహిర్గతంగా కులం గురించి చెప్పుకుంటే తప్పేముంది. అనే ధోరణిలో సాగిన వర్మ సాంగ్ ఆలోచింపజేసేదిలా ఉంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :