మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్ నటించిన సినిమా ‘కరెంట్ తీగ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఎప్పుడూ అందరితో అల్లరి చేస్తూ సరదాగా ఉంటూ, తన పని ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోయే మనోజ్ కి కులం గురించి మాట్లాడుకుంటే మాత్రం తన లోని అపరిచితుడు బయటకి వస్తాడని అంటున్నారు.
ఈ కుల పిచ్చి అనేదానిపై మనోజ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఉన్న సొసైటీలో డ్రగ్స్ పిచ్చి లేదా మందు పిచ్చి కంటే ప్రమాదకరమైన కుల పిచ్చి బాగా ఎక్కువైపోతోంది. అది అసలు ఉండకూడదు. అది రాబోవు తరాలకి చాలా డేంజర్. నా ముందు ఎవరన్నా కాస్ట్ గురించి మాట్లాడారు అంటే నాలోని అపరిచితుడు బయటకి వచ్చి వాళ్ళని ఓ ఆట ఆడుకుంటాను. ట్విట్టర్ లో కూడా ఇలాంటి ఓ సంఘటనపై ఘాటుగా స్పందించాను. అందుకే అందరికీ నేను చెప్పేది ఏమిటంటే కుల పిచ్చిని అస్సలు పెంచుకోకండని’ అన్నాడు.
కరెంట్ తీగ సినిమాలో మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఒక స్పెషల్ రోల్లో కనిపించనుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అచ్చు మ్యూజిక్ అందించాడు.


