‘నాని, రామ్‌, రానా’లు ఒకలా.. ప్రకాష్ రాజ్ మరోలా !

Published on Nov 21, 2021 8:14 pm IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొని కొందరు రైతులు ప్రాణాలను కోల్పోయారు. మోదీ ఈ అంశం పై మాట్లాడుతూ బాధ పడ్డారు. అయితే, ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈ నిర్ణయం మంచిదని, అన్నదాతల కుటుంబాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని సోషల్‌ మీడియాలో హీరోలు నాని, రామ్‌, రానాలు పోస్టులు పెట్టారు.

తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఈ అంశం పై మాట్లాడుతూ.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ.. ‘ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. క్షమాపణలు ఒక్కటే సరిపోవు. ఆ రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా?’’ అంటూ పోస్ట్ చేశారు. అలాగే హీరో రామ్ ఈ అంశం పై పోస్ట్ పెడుతూ.. ‘సాగు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను పక్కనపెడితే.. అన్నదాతల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోంది’’ అంటూ రామ్‌ మెసేజ్ చేశాడు. ‘నాని, రామ్‌, రానా’లు ఒకలా పోస్ట్ పెడితే.. ప్రకాష్ రాజ్ మరోలా పోస్ట్ పెట్టాడు.

సంబంధిత సమాచారం :