మీరు లభించడం తెలుగువారి అదృష్టం – మెగాస్టార్ చిరంజీవి

మీరు లభించడం తెలుగువారి అదృష్టం – మెగాస్టార్ చిరంజీవి

Published on Apr 20, 2025 12:02 PM IST

నేడు ‘దార్శనికుడు, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు విషెస్‌ తెలుపుతూ.. ‘దూరదృష్టి కలిగిన నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టమంటూ చంద్రబాబు సేవలను కొనియాడుతూ విషెస్‌ తెలిపారు.

ఇంతకీ, మెగాస్టార్ తన విషెస్‌ లో ఏం చెప్పారంటే.. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న గొప్ప నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మీకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి శ్రమించే, దార్శనికత కలిగిన, ఉత్సాహవంతుడైన, నిబద్ధత కలిగిన నాయకుడు లభించడం తెలుగువారి అదృష్టం. మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు