నంది అవార్డుల జాప్యంపై జగన్ స్పందిస్తారా ?

Published on Jul 16, 2019 2:01 am IST

తెలుగు పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ప్రదానోత్సవం గత కొన్నేళ్లుగా సక్రమంగా జరగట్లేదు. 2014, 2015, 2016 గాను నంది అవార్డుల విజేతల్ని ప్రకటించి దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటివరకు ప్రధానోత్సవ కార్యక్రమం జరగలేదు. మొదట్లో కొందరు ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఆ తరవాత అంతా మర్చిపోయారు.

కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి ఈ అవార్డుల జాప్యాన్ని ప్రస్తావనకు తెస్తున్నారు సినీ ప్రముఖులు. ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించి కార్యక్రమం జరిగేలా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. మరి జగన్ వీరి కోరిక పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే అవార్డులను సొంతం చేసుకున్న ఉత్తమ చిత్రాల జాబితాలో ‘బాహుబలి, లెజెండ్, పెళ్లి చూపులు’ చిత్రాలు ఉండగా ఉత్తమ నటులుగా బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు ఎంపికయ్యారు.

సంబంధిత సమాచారం :

More